Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాదాద్రి దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు

kcr visits yadadri
  • కొనసాగుతోన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవం
  • శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం 
  • కేసీఆర్‌కు కంక‌ణ‌ధార‌ణ.. పండితుల ఆశీర్వ‌చ‌నం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతోంది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు కంక‌ణ‌ధార‌ణ చేసిన‌ పండితులు ఆశీర్వ‌చ‌నం అందించారు. 

అక్క‌డి ఏడు గోపురాల‌పై ఉన్న క‌ల‌శాల‌కు ఏక‌కాలంలో కుంభాభిషేకం, సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ మ‌హోత్స‌వం ముగిసిన అనంత‌రం ప్ర‌ధానాల‌య ప్ర‌వేశ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఉపాల‌యాల్లోని ప్ర‌తిష్ఠామూర్తుల‌కు మ‌హాప్రాణ‌న్యాసం చేస్తారు. ఆరాధ‌న సంప్రోక్ష‌ణ అనంత‌రం గ‌ర్భాల‌యంలో స్వ‌యంభువుల ద‌ర్శ‌నం ప్రారంభం అవుతుంది.

KCR
Yadadri Bhuvanagiri District
TRS

More Telugu News